‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అర్హుల గుర్తింపుపై పంచాయతీ రాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 2లోగా అర్హుల గుర్తింపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. లబ్ధిదారుల వివరాలను అదే రోజు సాయంత్రం 5 గంటల లోపు ఆన్ లైన్‌లో నమోదు చేయాలని సూచించింది. ఆ తర్వాత మార్పులు, చేర్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. ఈ పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలు అందించనుంది.