తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం మొబైల్ యాప్ సిద్ధమైందని గృహ నిర్మాణ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ యాప్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 6 (శుక్రవారం)నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు తేడా లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.