అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు అందించడం జరుగుతుందని తిగుల్ గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాములమ్మ, భారతి, బిక్షపతి, నర్సింలు, మహేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మంజుల మహేందర్ రెడ్డి లు తెలిపారు. మంగళవారం ఇందిరమ్మ కమిటీ సభ్యులను కాంగ్రెస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటికి సహకరించిన డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, ఏఎంసి చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో అర్హులైన పేదలను ఇందిరమ్మ కమిటి ద్వారా గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామంలో ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. హస్తం పేదల నేస్తమని, పేదల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ మండల అధ్యక్షుడు లోకేష్, నాయకులు జనార్థన్ రెడ్డి, నర్సింహరెడ్డి, జంగని అయిలయ్య, వెంకట్ రెడ్డి, రాములు, బాల్ రెడ్డి, శ్రీరాంరెడ్డి, యాదగిరి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.