ఇందిరమ్మ ఇండ్లు పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేసింది. సొంత జాగా ఉండి ఇల్లు లేని పబ్లిక్ కు 100 శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఇందిరమ్మ స్కీమ్ కింద ఇళ్లు సాంక్షన్ చేయనుంది. ఇందుకు నాలుగు దశల్లో రూ.5 లక్షలను లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో బదిలీ చేయనుంది. లబ్ధిదారుల ఎంపికకు ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు కూడా పూర్తయింది. స్కీమ్ అమలును త్వరలో స్టార్ట్ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.