Indiramma Housing Scheme: జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలో ప్రజాపాలనలో మొత్తం 69,83,895 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 65,22,849 (93శాతం) దరఖాస్తుల యాప్ సర్వే పూర్తయ్యింది. సంక్రాంతిలోపు 32 జిల్లాల్లో సర్వే పూర్తి కానుంది. సర్వే పూర్తయిన జిల్లాల్లో సాధ్యమైనంత త్వరగా ‘సూపర్ చెక్’ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను రూపొందించనున్నారు. సంక్రాంతి తర్వాత గ్రామసభలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులోనే లబ్ధిదారుల ఎంపిక ఉండనుంది.