Indiramma Illu: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. తక్కువ ధరకే సిమెంట్ అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై సిమెంట్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం కుదిరిన తర్వాత మార్కెట్ రేటుతో పోలిస్తే తక్కువ ధరకే లబ్ధిదారులకు సిమెంట్ అందజేయాలని యోచిస్తోంది. ఈ నెల 30లోగా రెండో విడత లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని సీఎం రేవంత్ ఆదేశించిన విషయం తెలిసిందే.