Indiramma Illu: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలివిడతలో 71 వేల మందికి ఇళ్లు మంజూరు చేసినప్పటికీ, అనర్హులు ఎక్కువగా ఉన్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే ఇళ్లు ఉన్నవారి పేర్లు జాబితాలో చేరడంతో పాటు, వారు నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో అధికారులు మరోసారి రీవెరిఫికేషన్ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అనర్హులను తొలగించి, నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన మంజూరు పత్రాలను వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సాయంతో నిరుపేదలకు ఇళ్లు కట్టించాలన్న లక్ష్యం ఉంది. అయితే, అనర్హుల చేరికతో పథకం పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.