Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి గల నిబంధనల గురించి తెలుసుకోండి.. సర్వే సమయంలో స్థలం చూపిన చోటే నిర్మించాలి. ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందిస్తే ఫొటోలు తీసి జియో ట్యాగింగ్ చేస్తారు. కనీసం 400 చదరపు అడుగులు కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాలి. పునాది పూర్తయిన తర్వాత రూ. లక్షను జమ చేస్తారు. ప్రతి ఇంటికి 8 ట్రాక్టర్ల ఇసుక, సిమెంటు, స్టీలు వంటి సామగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందిస్తారు. ఏఈ/ఎంపీడీవోలు ఇంటి నిర్మణాణం పూర్తయిన దశను బట్టి నగదు జమకు సిఫార్సు చేస్తారు.