Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.లక్ష జమకానుంది. తొలి విడతలో 4.5 లక్షల మందిని ఎంపిక చేస్తారని, వారి జాబితాను ఇన్ఛార్జి మంత్రులు ఫైనల్ చేయగానే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని సమాచారం. మొదటి ఫేజ్లో లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున జమవుతాయని తెలిసింది. దీనిపై సర్కార్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ‘రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ’ అని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.