ఇందిరమ్మ ఇండ్లుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు పథకంలో అక్రమాలను ఏఐ టెక్నాలజీతో గుర్తిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టేందుకు ఇప్పటికే ప్రత్యేక యాప్‌ను రూపొందించి సర్వే పూర్తి చేశామన్నారు. రోజువారీగా ఇండ్ల నిర్మాణ పురోగతిని పర్యవేక్షించేలా ఏఐని వాడుకోవాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.