Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను అధికారులు మూడు జాబితాలుగా విభజించారు. సొంత ఇంటి స్థలాలు ఉండి ఇళ్లు లేనివారిని L-1 జాబితాలో చేర్చారు. సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారిని కూడా ఈ జాబితాలో చేర్చారు. సొంత స్థలం లేనివారు L-2లో ఉన్నారు. వీరంతా స్థలంతో పాటు ఎలాంటి ఇళ్లు లేనివారే. సొంత ఇల్లు ఉండీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L-3లో చేర్చారు. తొలి విడతలో ఎల్-1 జాబితాలో ఉన్నవారికే ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయనుంది.