Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాము రూపొందించిన యాప్ లోనే సర్వే చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రీ-సర్వే చేయమని కోరినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామసభల ద్వారా దరఖాస్తులు సేకరించినా, తాము రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా సర్వే చేస్తేనే నిధులు ఇస్తామని తేల్చి చెప్పినట్లు వినిపిస్తోంది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం.