Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్ల నిర్మాణానికి ఉచిత ఇసుకను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గనులు, ఖనిజాభివృద్ధి శాఖపై అధికారులతో సమీక్షలో మాట్లాడుతూ.. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఆ వార్త కూడా చదవండి: పంచాయతీ ఎన్నికల్లో ‘కోతి’ తిప్పలు.. అదేంటి అనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోండి..!