Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇండ్లు.. అర్హులు వీరే..!

ఇందిరమ్మ ఇండ్లు.. అర్హులు వీరే..!

ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా కాంగ్రెస్ సర్కార్ నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనుంది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులు.. ఎవరు కాదు తెలుసుకుందాం.. ఇల్లు లేని నిరుపేదలు, ఒకవేళ ఇల్లు ఉంటే అది రెండు గదులలోపు కచ్చా ఇల్లు అయితే ఇందిరమ్మ ఇంటి దరఖాస్తులు అర్హులు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా రోజువారీ కూలీ అయి ఉండాలి. కుటుంబ సభ్యులు, సంపాదించే వ్యక్తులు, స్థిర, చరాస్తుల వివరాలు, రేషన్‌ కార్డు, ఆదాయం, సొంత ఇల్లు ఉందా? ఉంటే అది పక్కా ఇల్లా కాదా? సొంత జాగా ఉందా? ఉంటే ఎంత ఉంది? కరెంటు కనెక్షన్‌, ఇంట్లో ఫ్రిజ్‌, టీవీ, వాహనం? గ్యాస్‌ కనెక్షన్‌ ఉందా? గతంలో ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధిపొందారా? వాటి వివరాలు వంటి సమాచారం యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తులు, ఇంటింటి సర్వే వివరాల ఆధారంగా గృహనిర్మాణ శాఖ అధికారులు యాప్‌లో నియోజకవర్గాలవారీగా దరఖాస్తు చేస్తారు. వికలాంగులు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుంది.

Recent

- Advertisment -spot_img