లోక్‌సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది.సోమవారం ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బామ్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రమేశ్ మెండోలా, మంత్రి కైలాష్ విజయవర్గీయలతో కలిసి రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లిన ఆయన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. ఎన్నికలకు మరో 14 రోజులు ఉండగా నామినేషన్ విత్ డ్రా చేసుకోవడం గమనార్హం. ఈ విషయంపై ఇండోర్ బీజేపీ అభ్యర్థి కైలాష్ విజయవర్గీయ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇండోర్ కాంగ్రెస్ అభ్యర్థికి బీజేపీ స్వాగతం పలుకుతోందని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.