సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మందన్నా శతక్కొట్టింది. 116 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్‌తో 100 పరుగులు చేసింది. దీంతో భారత స్కోరు 42.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 209 పరుగులకు చేరింది. స్మృతికి దిప్తీ శర్మ (37) మాత్రమే సపోర్టు చేయడంతో ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.