Homeహైదరాబాద్latest News'అమ్మా'నవీయం.!!

‘అమ్మా’నవీయం.!!

ఇదే నిజం, కోరుట్ల : సమాజంలో ఆడపిల్లలంటే చిన్నచూపు ఎప్పుడు కనుమరుగవుతుందో? పసిపిల్లలని కూడా చూడకుండా కడతేరుస్తున్నారు. తాజాగా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి టౌన్‌లో పసికందును నీళ్లలో పడేసారు గుర్తు తెలియని వ్యక్తులు.

ఏమిటమ్మా..ఇది.!
నేనేం పాపం చేశానమ్మా..?
నవమాసాలు మోస్తవనుకుంటే..?
నాలుగైదు నెలలకే బరువైపోయానామ్మా..?
అందుకేనామ్మా నన్ను మురికి కాలువ పాలు చేశావు..?
సుఖాన్ని నీవు ‘అనుభవించి’..
‘దుర్ఘంధాన్ని’ నాకేందుకు అంటించావమ్మా.!?
పాపం నువు చేస్తే..
శాపం నాకెందుకమ్మా..?
ఇంతకూ నువ్ పెళ్లికి ముందే నన్ను కనాలనుకున్నావా.? లేక నా ద్వారానైనా.? నీ పెళ్లి చేసుకుందామనుకున్నావా.?లేదా..? పెళ్లయ్యాక..
నీ ముదనష్టపు అత్తింటోళ్లు ‘స్కానింగ్’చేయించి..’ఆడపిల్లా’ని గుర్తించి..నన్ను పురిట్లోనే చంపేస్తే పీడపోద్దని ఇలా మురికికాల్వలో పడేసారా.!?
నీవు నీ అమ్మా-నాన్నలను..
‘అమ్మా నాన్న’ అని ఆప్యాయంగా పిలిచుకున్నావు..
మరి నాకెందుకు ఆ అదృష్టాన్నివ్వలేదమ్మా.?
నాలుగైదు నెలలకే ఇంత బరువనిపించాను కదా.? ఇంకొన్ని నెలలు మోసి..
పిల్లలు లేని ఏ దురదృష్టవంతులకో నన్ను దానం చేస్తే నీకు పుణ్యమైనా వచ్చేదేమో కదామ్మా.!?
నాలాగే ఎందరినో ఈ పాడు లోకం నీకు లాగానే ‘వద్దనంగ’ పుట్టినోళ్లమైన మమ్మల్ని..
ఏ చెత్తకుండీల వద్దనో..
ఏ పొదల్లల్లనో.. ఏ మురికి కాలువల్లోనో.. పారేస్తే..
కుక్కలు.. పందులు..పీక్కుతిన్న ముచ్చట్లు నువు ఇదివరకు వినలేదా.?చూడలేదామ్మా.!? అవి చూసున్నా.? విని ఉన్నా,.? నన్ను కనేదానివే కాదేమో.? కన్నా..పారేసే దానివి కాదేమో కదామ్మా.!? నాకంతా ఇక్కడ చీకటిగా ఉందమ్మా..
నీళ్లలో పడవేశావు కదమ్మా..
కడుపు నింపుకున్నానమ్మా .!
నాకింకా ‘అమ్మపాల’రుచి తెలీదు కదమ్మా.!?
ఎందుకమ్మా ఇలా చేశావు.? ఏడుపొస్తుందమ్మా.? కన్నీరు ఆగటం లేదమ్మా..రాత్రంతా నీళ్లలో నానిపోయాను కదమ్మా..ఆకలిగా ఉందమ్మా..!?
ఏడవడానికి కూడ బలం లేదమ్మా.. అంత పెద్ద వయసులో నీవే తప్పు చేశావు. కదమ్మా.. ఏ పాపమూ చేయని నాకెందుకమ్మా ఇంత పెద్ద శిక్షా..?
కన్నతల్లి గురించి అందరూ ఎంతో గొప్పగా చెబుతారు కదమ్మా.. ఇదేనామ్మ అమ్మ గొప్పతనమంటే.?
దుర్వాసనకు ఊపిరి ఆగిపోయిందో..ఊపిరితీశాకే ఇలా పారేశారో..ఆ పారేసినామె కూడా ఓ అమ్మనే అయ్యుంటుంది కదామ్మ.?
నీవు పడుకున్నపుడు ఎలా ఉన్నావో తెలియదు కానీ నన్ను మాత్రం కనీసం బట్టలు కప్పకుండా వదిలేశావు కదమ్మా.!? కనీసపు జాలి కూడా మీకు కలుగలేదా అమ్మా.. పసిపిల్లలు దేవుళ్లంటారు కదమ్మా..
మరి దేవుళ్లనీ చెత్తలో పడవేశావెందుకమ్మా..?
నిన్ను శపించాలని ఉందమ్మా.? కానీ సాటి ఆడపిల్లను కదమ్మా.. ఆ పని చేయలేక పోతున్నాను.. కానీ ఓ మాట అమ్మా.. వీలైతే పెళ్లి చేసుకుని మమ్మల్ని కని పెంచండి..!
కానీ..తప్పు మీరు చేసి.. మమ్మల్ని ఇలా విసిరేసి నిజమైన ‘అమ్మ పరువు’ బజారుపాలు చేయకండమ్మా.! అమ్మా.. అమ్మా.. నీ కడుపులో పడినందుకు.. నాకు నీవిచ్చిన ఇంత పెద్ద బహుమానానికి ఏం చెప్పాలో తెలియడం లేదమ్మా.. ఒకరోజు పాపను కదా.. అమ్మా.. అమ్మా. నన్ను నీ కడుపులోకి పంపిన ఆ దేవుడి దగ్గరకే పోతున్నానమ్మా..!
అమ్మా… అ….. మ్…… మా…..!???

ఇంకే జన్మలో కూడా నువ్ నాకు తల్లిగా పుట్టకమ్మా..!!??

Recent

- Advertisment -spot_img