Homeహైదరాబాద్latest Newsఅమానుషం.. మైనర్ బాలిక పై వృద్ధుడు అత్యచారం

అమానుషం.. మైనర్ బాలిక పై వృద్ధుడు అత్యచారం

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం లో దారుణం జరిగింది. ఇటీవల పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే అలాంటి అమానుష ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న బాలికపై గంగ నరసయ్య అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వృత్తి రీత్యా టేలర్ అయిన నిందితుడు గంగ నరసయ్య బాలికకు మాయమాటలు చెప్పి అతని టైలర్ షాప్ లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అత్యాచారానికి గురైనట్లు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం 덩 మారగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img