ఇదేనిజం, ఎండపల్లి: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిధి గా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్.ఎం రాజమణి హాజరు కాగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సూర్య కుమారి, ఉపాధ్యాయులు ప్రణీత, తిరుపతి, శ్రీనివాస్, తిరుపతి. అంగన్వాడి టీచర్లు రమాదేవి, స్వప్న, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు జి. కవిత తదితరులు పాల్గొన్నారు.