గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అవార్డులు ప్రకటిస్తూ ఉంటుంది. ఈ ప్రకటన లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే చెప్పాలి. కేంద్రం పూర్తిగా వివక్ష చూపిందని స్పష్టంగా అర్ధమవుతుంది. దీనిపై తెలంగాణ ప్రజలు పూర్తిగా అసంతృత్తి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు ఒక్కటే అవార్డు. అది మంద కృష్ణ మాదిగ కి, మంద కృష్ణ ఒక కులం కోసం కొట్లాడుతున్న వ్యక్తి, అందరివాడు కాదు. అలాగే పద్మ విభూషణ్ వచ్చిన Dr దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి కోట్లకు పడగలెత్తిన కామర్షియల్ మనిషి. పేదల కోసం అయన చేసింది జీరో, ఈ అవార్డు ఆయన సంపదను మరింత పెంచేందుకే ఉపయోగపడుతుంది. ఆయన హాస్పిటల్ లో సాధారణ ప్రజలకు చికిత్స కష్టం. సంపన్నులకు మాత్రమే ఆయన హాస్పిటల్ లో చికిత్స సాధ్యమవుతుంది. అలాంటి వ్యక్తికి అవార్డు రావడం పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీకి నచ్చినవాళ్లకే అవార్డులు అన్నట్లుగా ఉంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.