Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం.. సొంత పార్టీ మీదే విమర్శలు చేసిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం.. సొంత పార్టీ మీదే విమర్శలు చేసిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు

  • నారీ న్యాయ్.. తెలంగాణలో అమలు చేయరా?
  • మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 241 కార్యక్రమాలు
  • అయినా ఓడిపోయే గోషామహల్ టికెట్ ఇచ్చారు
  • మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు విమర్శించారు. రాహుల్ గాంధీ నారీ న్యాయ్ పేరుతో మహిలకు అన్ని రంగాల్లో పెద్ద పీట వేయాలని చూస్తుంటే తెలంగాణ లో మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. సోమవారం ఆమె గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కార్పొరేషన్‌ పదవులు సహా వివిధ ప్రభుత్వ పదవుల్లో మహిళలకు సమానవాటా దక్కలేదన్నారు. నామినేటెడ్ ప‌ద‌వుల్లో మ‌హిళల‌కు అన్యాయం జ‌రిగింద‌న్నారు. పార్టీలో గౌర‌వం ద‌క్క‌డం లేదంటూ ఆమె క‌న్నీరు పెట్టుకున్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా 241 కార్యక్రమాలు నిర్వహించాన‌ని తెలిపారు. అయిన‌ప్ప‌టికీ తనకు ఓడిపోయే గోషామహాల్‌ అసెంబ్లీ సీటు ఇచ్చారని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన వారికి నామినేటెడ్ ప‌ద‌వులు ఇవ్వం అని ఎన్నిక‌ల‌కు ముందు చెప్పారు. కానీ ఇప్పుడు ఓడిపోయిన వారికి కూడా ప‌ద‌వులు ఇచ్చార‌ని సునీత రావు గుర్తు చేశారు.

Recent

- Advertisment -spot_img