– క్వాష్ పిటిషన్ తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున వాయిదా వేసిన ఏపీ హైకోర్టు
ఇదే నిజం, ఏపీ బ్యూరో: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను ఏపీ హైకోర్టు నవంబర్ 7కు వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున కేసుని వాయిదా వేశారు. అమరావతి రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్‌ను సీఐడీ అధికారులు గతంలో విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. పీటీ వారెంట్ విచారణ పై స్టే విధిస్తూ గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆ ఉత్తర్వులను సైతం నవంబర్ 7 వరకు పొడిగించింది.