– బీఆర్ఎస్ వేసిన రెండు పిటిషన్లను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: కారును పోలిన గుర్తులు రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా.. హైకోర్టు కొట్టివేసిన పిటిషన్‌పై ఆలస్యంగా వచ్చారని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది. అధికార పార్టీ అయివుండి.. 240 రోజులు ఆలస్యంగా ఎలా వస్తారని ప్రశ్నించింది. పిటిషన్‌పై విచారణ చేపట్టడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. తమకు హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలన్న బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కోరగా.. కావాలంటే హైకోర్టుకు వెళ్లొచ్చని తెలిపింది. అయితే మెరిట్స్ ఆధారంగానే అక్కడ విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.