Homeహైదరాబాద్లోతట్టు ప్రాంతాలు సందర్శించిన మేయర్, కమిషనర్

లోతట్టు ప్రాంతాలు సందర్శించిన మేయర్, కమిషనర్

మేడిపల్లి, ఇదే నిజం: బోడుప్పల్ కాలనీల ఫెడరేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమీషనర్ శంకర్​లు సాయి నగర్ కాలని, చింతకుంట చెరువును సందర్శించటానికి కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, కమీషనర్ శంకర్ , ఎమ్మార్వో, కాంగ్రెస్ పార్టి ప్లోర్ లీడర్ పోగుల నర్సింహ్మ రెడ్డి, ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములులు సాయినగర్ కాలని, చింతకుంట చెరువును పరిశీలించారు. గత కొన్ని సంవత్సరాలుగా చెంగిచర్లలోని వివిధ కాలనిల వాసులు ఎదుర్కొంటున్న డ్రెయినేజీ అవుట్ లెట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని మేయర్, కమీషనర్​ను ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు కోరడం జరిగింది. దీనికి స్పందించిన మేయర్, కమీషనర్​లు అందరం కలిసి త్వరలో ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్​లు కొత్తచందర్ గౌడ్, బింగి జంగయ్య, కో- ఆప్షన్ సభ్యులు రంగు బ్రహ్మన్న గౌడ్ కాంగ్రెస్ పార్టి కార్పోరేటర్​లు తోటకూర అజయ్, బొమ్మక్ కల్యాణ్, బీజేపీ కార్పోరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఫెడరేషన్ అధ్యక్షులు కలుకూరి రాములు, టీఆర్ఎస్ పార్టీ నేతలు కొత్త రవి గౌడ్,విక్రమ్ గౌడ్,
కాంగ్రెస్ పార్టీ నేతలు కొత్త ప్రభాకర్ గౌడ్, కుర్రి శివ శంకర్, కొత్త కిషోర్ గౌడ్, చీప్ అడ్వైజర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రదాన కార్యదర్శి డాక్టర్. కె.ప్రకాష్,మోరపాక శ్రీనివాస్, పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది, సాయి నగర్ కాలని వాసులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img