Homeహైదరాబాద్latest NewsCM KCR ఎన్నికల వాహనం తనిఖీ

CM KCR ఎన్నికల వాహనం తనిఖీ

– ప్రచార బస్సును తనిఖీ చేసిన కేంద్ర బలగాలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వాడుతున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ కరీంనగర్‌ జిల్లా మానకొండూరులో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభకు హాజరవనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి ప్రగతి రథం బస్సు వెళ్తున్న సమయంలో కరీంనగర్ జిల్లా గుండ్లపల్లి టోల్‌గేట్‌ వద్ద కేంద్ర బలగాలు నిర్వహించాయి. బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఎన్నికల నిబంధనలను అనుసరించి బలగాలకు సిబ్బంది పూర్తిగా సహకరించారు. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మానకొండూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ నియోజకవర్గాల్లో జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరై ప్రసంగించనున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img