Homeహైదరాబాద్latest Newsప్రైవేట్ హాస్టల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

ప్రైవేట్ హాస్టల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

హైదరాబాద్ లోని పలు హోటల్, రెస్టారెంట్ లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.. హెచ్ఎంసీ పరిధిలోని ప్రైవేట్ హాస్టల్స్ భాగోతం బయటపెట్టారు. ఆ డీటేల్స్ ఎవరో తెలుసుకుందాం.. మొన్నటి వరకూ హోటల్స్ పై దాడులు చేసి.. పలు హోటళ్లను సీజ్ చేసిన ఫుడ్ సేప్టీ అధికారులు.. సడన్ గా రూటు మార్చారు. జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రైవేట్ హాస్టల్స్ పై తనిఖీలు చేస్తున్నారు. నగరంలో వందల సంఖ్యలో ఉన్న హాస్టల్స్ లోని పదార్థాల నిర్వహణపై దాడులు చేశారు. పలు హాస్టల్‌లో ఎక్స్‌పైరీ అయిన మసాలాలు, కుళ్లిపోయి, బూజుపట్టిన కూరగాయలను గుర్తించారు. కిచెన్ ఏరియాలో అపరిశుభ్రత.. క్లీన్‌గా లేని ఫ్రిడ్జ్.. బుష్ కలర్స్ గుర్తించారు. వంట సామాన్లు అపరి శుభ్రంగా ఉండడం గమనించారు. గుట్కా తిని కిచెన్ వాల్స్ పై ఉమ్మి వేయడాన్ని గుర్తించారు అధికారులు. పలు చోట్ల హాస్టల్ కిచెన్‌లో పురుగులు పట్టి ఉండడాన్ని చూసి అధికారులు ఫైర్ అయ్యారు.

Recent

- Advertisment -spot_img