HomeసినిమాIntensely 'Saindhav' Teaser ఇంటెన్సివ్​గా ‘Saindhav’ Teaser

Intensely ‘Saindhav’ Teaser ఇంటెన్సివ్​గా ‘Saindhav’ Teaser

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్​గా సస్పెన్స్​ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘సైంధవ్’. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ సోమవారం రిలీజ్ అయ్యింది. ఇంటెన్సివ్​గా ఉన్న ఈ మూవీ టీజర్​ను చూస్తే.. సినిమాలో​ కంప్లీట్‌ భారీ యాక్షన్‌ మోడ్‌లో సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్​లో వెంకటేశ్ ఫ్యామిలీ మ్యాన్ నుంచి ఫుల్​ యాక్షన్​ మోడ్​లోకి మారిన సీన్స్ గూస్​ బంప్స్​ తెప్పించేలా ఉన్నాయి. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ సినిమాలో ఓ నెగెటివ్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. నవాజుద్దీన్ ఈ మూవీ కోసం తెలుగులో తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, జయప్రకాశ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను నిహారిక బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్​ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Recent

- Advertisment -spot_img