Inter Admission:రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రవేశాల గడువు గతంలో జులై 25తో ముగియగా ఇంటర్ బోర్డు జులై 31వ తేదీ వరకు పొడిగించింది. ఆ తర్వాత ఆగస్టు 5 వరకు గడువు పొడిగించింది. తాజాగా మరోమారు ప్రవేశాల గడువు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన వెలువరించింది. ఈ మేరకు ఆగస్టు 5 వరకు ఉన్న గడువును ఆగస్టు 16వ తేదీ వరకూ పొడిగిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ప్రకటన వెలువరించారు.