Inter Advanced Supplementary: తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొద్దిసేపటి క్రితం ఫలితాలను విడుదల చేశారు. అయితే, రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ కోసం వారం రోజుల గడువు విధించారు. మే 22 నుండి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 69.89 శాతం, రెండవ సంవత్సరంలో 71.37 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.