Homeవిద్య & ఉద్యోగంఇంట‌ర్ ఆన్‌లైన్ క్లాసెస్ టైం టేబుల్ రిలీజ్‌

ఇంట‌ర్ ఆన్‌లైన్ క్లాసెస్ టైం టేబుల్ రిలీజ్‌

హైదార‌బాద్ః కరోనా కారణంగా ఆలస్యమైన విద్యా సంవత్సరాన్ని(2020-21) ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి టైమ్ టేబుల్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్ధులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. మార్నింగ్ సెషన్లో ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు ఆన్‌లైన్‌ క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండనున్నాయి. వారంలో ఆరు రోజులు (సోమ-శని) వరకు దూరదర్శన్ యాదగిరి ఛానెల్‌ ద్వారా విద్యార్ధులకు తరగతులు బోధించానున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img