Inter Results : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల చేయడానికి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా పరీక్షా మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. సమాధానాల మూల్యాంకన ప్రక్రియ పూర్తికావడంతో ప్రస్తుతం కంప్యూటరీకరణ ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 15న విడుదలై అవకాశం ఉంది. మొత్తం 9 లక్షల 96 వేల 971 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చ్ 5 నుంచి 24 వరకు జరగగా, రెండవ సంవత్సరం పరీక్షలు మార్చ్ 6 నుంచి 25 వరకూ జరిగాయి. ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరం ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in లో చెక్ చేసుకోవచ్చు. ఈసారి ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లోనే కాకుండా… ప్రభుత్వం తీసుకువచ్చిన మన మిత్ర వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను అందుబాటులోకి తీసుకురానుంది.