Inter results : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు (Inter results) మార్చి 25న ముగిశాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ పరీక్షలను నిర్వహించింది. ఇంటర్మీడియట్‌లోని అన్ని సబ్జెక్టుల పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ నెల ఆఖరి వారంలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. గతేడాది మార్చి 19న ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. వాటి ఫలితాలు ఏప్రిల్ 24, 2024న విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో 2025 పరీక్షా ఫలితాలు కూడా ఏప్రిల్ నెలలోనే విడుదల కానున్నాయి.