INTER RESULTS: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో HEC, CEC గ్రూప్ విద్యార్థుల పనితీరు నిరాశపరిచింది. ఫస్ట్ ఇయర్‌లో HEC గ్రూప్‌లో 8,959 మంది పరీక్ష రాయగా, 3,092 మంది (34.51%) మాత్రమే పాస్ అయ్యారు. CEC గ్రూప్‌లో 92,745 మంది హాజరై, 42,259 మంది (45.56%) ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్‌లో HECలో 9,031 మంది పరీక్ష రాయగా, 4,178 మంది (46.26%) పాస్ అయ్యారు. CECలో 1,03,713 మంది హాజరై, 48,658 మంది (46.92%) ఉత్తీర్ణత సాధించారు.