ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు అంశం చివరి దశలో ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. షెడ్యూల్ దాదాపు ఖరారైందని తెలుస్తుంది. మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అన్ని గ్రూపుల ఇంటర్ పరీక్షల నిర్వహణకు దాదాపు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. ఈ నెలాఖరులోగా పరీక్షలు పూర్తి కావాలంటే మార్చి 3న పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంటుందని, ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణ పూర్తవుతుందని అధికారులు తెలిపారు.డిసెంబరు 3వ తేదీ వరకు ఆలస్య రుసుముతో జనవరి 2 వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించగా.. రూ.2 వేల ఆలస్య రుసుంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 9 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరవుతారని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రంలో పరీక్షలకు ఏర్పాట్లు చేయనున్నారు.