తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదలయ్యాయి. రేపటి నుంచి మే 2వ తేదీ వరకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మే 24 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం తెలిపారు.
అయితే తెలంగాణ ఫస్ట్ ఇయర్ 2, 87, 261 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్, సెకండ్ ఇయర్ 60.01 శాతంగా ఉత్తీర్ణత నమోదు అయిందని తెలిపారు. అలాగే సెకండ్ ఇయర్ లో 3,22,432 మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ లో 64.19% ఉత్తీర్ణత శాతం నమోదు అయింది. తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలలో బాలికదే పైచేయి అని విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం ప్రకటించారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: tsbie.cgg.gov.in
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: results.cgg.gov.in