Homeసినిమాఇంట్రెస్టింగ్​గా ‘కన్నప్ప’ First Look

ఇంట్రెస్టింగ్​గా ‘కన్నప్ప’ First Look

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’.పాన్ ఇండియా మూవీకి తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విష్ణు.. అగ్ర నటులను తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రభాస్​ శివుడి పాత్రలో కనిపించనున్నాడే వార్తలు అప్పట్లో వైరల్​ అయ్యాయి. పక్కా ప్లానింగ్​, భారీ బడ్జెట్​తో విష్ణు ఈ మూవీని గ్రాండ్​గా నిర్మిస్తుండగా.. ముఖేశ్​ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్​లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. శుక్రవారం మంచు విష్ణు బర్త్​ డే సందర్భంగా మేకర్స్ ఫస్ట్​ లుక్​ను రిలీజ్ చేశారు. మహా శివలింగం ముందు విల్లు ఎక్కుపెట్టి మంచు విష్ణు ఇందులో కనిపిస్తున్నాడు. ఈ సినిమాతో ఆడియెన్స్​కు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ, స్టీఫెన్ దేవస్సి ఈ సినిమాకు మ్యూజిక్​ అందిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img