అమిత్ రవీంద్రనాథ్‌శర్మ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ నటించిన తాజా చిత్రం ‘మైదాన్’. ఇండియన్ లెజెండరీ ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ రహీమ్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ప్రస్తుతానికి రెంటల్ విధానంలో (రూ.349) మైదాన్ అందుబాటులోకి వచ్చింది. జూన్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు అందరికి ఈ మూవీ ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.