టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మాస్ మసాల మూవీ ‘గుంటూరు కారం’.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతోంది. గత నెల మేకర్స్ రిలీజ్ చేసిన ‘ధమ్ మసాలా’సాంగ్ మహేశ్ ఫ్యాన్స్, ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా గుంటూరు కారం నుంచి సెకండ్ సింగిల్‌గా ఓ మెలోడీ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. అయితే, ఈ సినిమాలో ఓ సాలిడ్ ఐటెం సాంగ్ కూడా ఉన్నట్లు తెలిసిందే. దీనిపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ సాంగ్ కోసం ఏ హీరోయిన్ను ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం కొంతమంది పేర్లు పరిశీలనలో ఉన్నాయని.. కానీ వాటిలో ఒక పేరు ఫైనల్ అయితే వెంటనే సాంగ్ షూట్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ నెల 25లోపే సినిమా మొత్తం కంప్లీట్ చేసేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. మరి ఈ సాంగ్‌పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.