Homeహైదరాబాద్latest Newsఆసక్తికరంగా AP Politics.. నియోజకవర్గాల్లో బీజేపీ కొత్త ఫిట్టింగ్

ఆసక్తికరంగా AP Politics.. నియోజకవర్గాల్లో బీజేపీ కొత్త ఫిట్టింగ్

రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు కేటాయించారు. అందులో 6 ఎంపీ అభ్యర్దులను బీజేపీ ప్రకటించింది. తొలుత ఇచ్చిన విజయనగరం స్థానం కాదని రాజంపేట నుంచి తమ అభ్యర్దిని ప్రకటించింది. ఇప్పుడు ఎమ్మెల్యే స్థానాల్లోనూ కొత్త డిమాండ్ తెర మీదకు తీసుకొచ్చింది. తమకు అదనంగా మరో సీటు ఇవ్వాలని కోరుతోంది. స్థానాల విషయంలో కొత్త ప్రతిపాదనలతో..టీడీపీ సీనియర్లలో టెన్షన్ మొదలైంది.
దీనితో కూటమిలో సీట్ల సర్దుబాటులో అనేక మార్పులు మొదలయ్యాయి. మూడు పార్టీల కూటమిలో బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలు అంగీకరించారు. జనసేనకు 2 ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. కాగా, జనసేన ఇప్పటి వరకు అధికారికంగా 18 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్దులను ఖరారు చేసింది. బీజేపీ 6 ఎంపీ స్థానాల్లో తమ అభ్యర్దులను ప్రకటించింది. 10 అసెంబ్లీ స్థానాల పైన నిర్ణయం జరిగిన తరువాత, ఇప్పుడు తమకు మరో సీటు కేటాయించాలని బీజేపీ ప్రతిపాదన తీసుకొచ్చింది. పది అసెంబ్లీ నియోకవర్గాల్లో అభ్యర్దులు ఖయమయ్యారని చెబుతున్నా..అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. బీజేపీ కోరుతున్న మార్పు

Recent

- Advertisment -spot_img