Homeహైదరాబాద్latest NewsInternational Chess Day: అంతర్జాతీయ చెస్ డే.. చదరంగం ఆట మూలాలు మనవే!

International Chess Day: అంతర్జాతీయ చెస్ డే.. చదరంగం ఆట మూలాలు మనవే!

International Chess Day: ప్రజలు అత్యంత ఇష్టపడే బోర్డ్ గేమ్‌లలో చదరంగం కూడా ఒకటి. ప్రపంచంలోని ప్రతిమూలలో చెస్ ఆడే వారు ఉంటారు. ‘జీవితమే ఒక చదరంగం’ అంటూ చెస్ ఆటను నిజ జీవితానికి సూచికగా చెప్తారు. చెస్ ఆట మెదడుకు పదునుపెట్టి మనలో చురుకుదనాన్ని పెంచుతుంది. దీనిని ఆడటానికి మంచి ఏకాగ్రత, చురుకైన మెదడు, అద్భుతమైన వ్యూహాలు, అంకితభావం అవసరం. ఈ ఆటలో ఒక రాజసం ఉంది. ఆటలో గెలవాలంటే ఎత్తుకు పైఎత్తులు వేయడం తెలిసుండాలి.
అయితే అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) 1924 జూలై 20న స్థాపించబడింది. ఈ క్రమంలోనే జూలై 20ని ఇంటర్నేషనల్ చెస్ డే గా జరుపుకోవాలనే యునెస్కో సూచనలమేరకు ఈరోజున అంతర్జాతీయ చదరంగ దినోత్సవం జరుపుకుంటున్నారు. నిజానికి 1966లో జూలై 20న మొదటి అంతర్జాతీయ చెస్ దినోత్సవం జరుపుకున్నారు. జూలై 20న ఈ దినోత్సవం సంధర్భంగా చాలా చోట్ల చదరంగం పోటీలు నిర్వహిస్తారు.

భారతదేశంలో పుట్టిన చదరంగం ఆట..
చదరంగం ఆట 6వ శతాబ్దంలో గుప్త రాజవంశం కాలంలో భారతదేశంలో పుట్టింది. గుప్తుల కాలంలో ఉత్తర భారత ఉపఖండంలో ఆడిన చతురంగ ఆటలో భాగంగానే చదరంగం మూలాలు ఉన్నాయని నమ్ముతారు. వివిధ దేశాల మధ్య వాణిజ్యం ప్రారంభమైనపుడు వర్తకుల ద్వారా భరతఖండం నుంచి పశ్చిమాన పర్షియా వరకు ఈ చదరంగం ఆట వ్యాపించింది. అక్కడ వారు ఈ ఆటను చత్రంగ్ లేదా షత్రంజ్ అనే పేరుతో పిలిచేవారు.

Recent

- Advertisment -spot_img