Homeజిల్లా వార్తలుస్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు

స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనము లో ఆదివారం నాడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు .అధ్యక్షుడు ఎన్.వి.టి, డాక్టర్ రవి ప్రకాష్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం ప్రతి ఒక్కరూ ఫ్రెండ్షిప్ బ్యాండ్లని ఒకరికొకరు కట్టుకున్నారు. అనంతరం అధ్యక్షుడు ఎన్ వి టి మాట్లాడుతూ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పేద ధనిక చూడని కులమత బేధం లేనిది బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒకటేనని, స్నేహమంటే భుజం మీద చేయి వేసి నడవడమే కాదు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెనకనే నేనున్నానని భుజం తట్టి చెప్పడం అని, స్నేహమంటే ఆడుకోవడం కాదు ఆదుకోవడం అని, వాడుకోవడం కాదు వదులుకోకపోవడం అని, వద్దనుకున్నా వచ్చేది మరణం, ఎంత ఉన్నా చాలన్నది ధనం, ఖర్చుపెట్టిన కొనలేనిది స్నేహమని ఈ సందర్భంగా వారు అంటూ స్వచ్ఛమైన స్నేహం చేయాలని అవసరం కొద్ది స్నేహాలు చేయొద్దని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరొక్కసారి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్, రాపోలు నిరంజన్, బత్తుల అమర్, లెండాల మోహన్ రావు ,పంతులాల్ నాయక్, తాళ్ల సురేష్ ,భాస్కర్ రెడ్డి, డాన్స్ మాస్టర్ క్రాంతి, బంజారా హీరో చందు నాయక్, డాన్స్ మాస్టర్స్ రాక్ స్టార్ రమేష్, ఏడుకొండలు, జగన్ ,జగదీశ్వర చారి, ఎస్ఎఫ్ఐవెంకటేష్, లైన్స్ క్లబ్ శ్రీను, అజయ్ చంద్ర, పోరికసాయి శ్రీనివాస్, కలట్ల గిరి, గోపాల్, మెటిల్ల స్కూల్ మాస్టర్ వినోద్ కుమార్, మెకానిక్ వినోద్, శ్రీను నాయక్, రాజు, కిషన్, రవికాంత్, స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, కళాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img