Homeఅంతర్జాతీయం#Russia #SpaceStation : ప్రపంచానికి మరో ముప్పు.. అంతరిక్ష కేంద్రంలో పేలిపోయిన రష్యా రాకెట్..

#Russia #SpaceStation : ప్రపంచానికి మరో ముప్పు.. అంతరిక్ష కేంద్రంలో పేలిపోయిన రష్యా రాకెట్..

ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసిన చైనా రాకెట్.. హిందూ మహాసముద్రంలో కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తాజాగా రష్యా అంతరిక్ష నౌక ఒకటి నియంత్రణ కోల్పోయింది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లోకి గతవారం రష్యా ప్రయోగించిన రాకెట్ అదుపుతప్పి కొద్ది గంటల్లోనే మండిపోయిందని అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా తెలిపింది.

ఈ రాకెట్‌లో ఉన్న ఏడుగురు వ్యోమగాములకు ఎటువంటి ప్రమాదం వాటిళ్లలేదని రష్యా అధికారిక మీడియా పేర్కొన్నట్టు వివరించింది.

ఏడుగురు వ్యోమగాముల్లో ఇద్దరు రష్యా, ముగ్గురు నాసా, ఒకరు జపాన్, ఐరోపా స్పేస్ ఏజెన్సీకి చెందినవారు ఒకరు ఉన్నట్టు పేర్కొంది.

తాజా ఘటనతో శుక్రవారం ప్రయోగించాల్సిన సీఎస్టీ-100 స్టార్‌లైనర్ క్యాప్యూల్‌ను ఆగస్టు 3 వరకు నాసా వాయిదా వేసింది.

ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి అట్లాస్-5 రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించాల్సి ఉంది.

మల్టీపర్పస్ మాడ్యూల్ గురువారం అంతరిక్ష కేంద్రంలోకి చేరిన దాదాపు మూడు గంటల తర్వాత ప్రమాదానికి గురయ్యింది.

భూమికి 250 మైళ్ల ఎత్తున ఐఎస్ఎస్‌లోకి చేరిన తర్వాత ఇంజిన్ రీస్టార్ చేస్తున్న సమయంలోనే అదుపుతప్పింది.

నాసా అంతరిక్ష ప్రోగ్రామ్ మేనేజర్ జోయల్ మోంటాల్‌బానో మాట్లాడుతూ… నౌక బయలుదేరిన 45 నిమిషాల కన్నా ఎక్కువసేపు నియంత్రణ కోల్పోయిందని, భూ కేంద్రంలో ఉన్న శాస్త్రవేత్తల బృందాలు.. కక్ష్యలో ఉన్న మరో మాడ్యూల్‌‌లోని ఇంజిన్‌ను మండించి తిరిగి పునరుద్ధరించగలిగాయని అన్నారు.

ఈ సమయంలో సిబ్బందితో కమ్యూనికేషన్ రెండుసార్లు కోల్పోయింది.. కానీ, వారికి తక్షణ ప్రమాదమేమీ లేదని మోంటాల్‌బానో చెప్పారు.

ఆటోమేటిక్ సెన్సార్ల ద్వారా అంతరిక్ష కేంద్రం సాధారణ స్థితిని గుర్తించి, అందులోని వ్యోమగాములకు ఎటువంటి ముప్పు లేదని నిర్ధారించినట్టు తెలిపారు.

నౌకలోని ఇంజిన్లు పనిచేయకపోవడానికి గల కారణాలేంటో తెలియరాలేదని నాసా పేర్కొంది.

అంతేకాదు, అంతరిక్ష కేంద్రానికి ఎటువంటి నష్టం జరిగినట్లు సంకేతాలు వెలువడలేదని చెప్పారు.

కజకిస్థాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుంచి గత వారం ప్రయోగించిన రాకెట్ వరుస అవాంతరాలను ఎదుర్కొంది.

తొలుత ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందా అనే ఆందోళన వ్యక్తమయ్యింది.

అంతరిక్ష కేంద్రానికి చేరిన తర్వాత ఇంజిన్‌ను పునఃప్రారంభిస్తుండగా అదుతప్పినా.. తిరిగి పునరుద్ధిరించామని రష్యా అంతరిక్ష కేంద్రం రోస్కోమాస్ చీప్ దిమిత్రీ రోగోజిన్ తెలిపారు.

అయితే, ఈ నౌక భూకక్ష్యలోకి ప్రవేశించే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.

ఇటీవలే చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్-బి రాకెట్ అదుపుతప్పి భూమిపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

హిందూ మహాసముద్రంలో ఇది కూలిపోయింది.

Recent

- Advertisment -spot_img