ఇదే నిజం జుక్కల్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మద్నూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఎస్సై విజయ్ కొండ ఆధ్వర్యంలో శనివారం సన్మానించారు. ఎస్సై మాట్లాడుతూ.. మహిళలు విద్య, వైద్య, క్రీడా రంగాలలో రాణించడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు.ఆడపిల్ల అంటే.. ‘ఆడే’ ఉండిపోవాలా..? ఫలానా పనికే పరిమితం కావాలా..? కట్టుబాట్ల బందిఖానాలో బందీ అయిపోవాలా..? ఎవరన్నారు.. సృష్టికి మూలం, అవనిలో సగం.. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. ఇలా ‘ఆమె’ కోసం ఎన్ని చెప్పినా, ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ రంగం.. ఈ రంగమన్న తేడా లేదు. పురుషులు చేసే ప్రతి పనినీ సమర్థంగా చేయగలిగే స్థాయికి చేరుకుంది నేటి ఆధునిక మహిళ. ‘సమానత్వమన్న’ పదానికి అర్థం చెబుతోంది. తన శక్తి అపరిమితం.. తన సహనం, తెగువ అనితర సాధ్యం. మధ్య మధ్యలో ఎక్కడో రాబందులు.. తన ఉనికికి అడొస్తున్నా, తన భవితను చిదిమేస్తున్నా.. వెరవక, వెనకడుగు వేయక.. ధైర్యంగా ముందడుగు వేస్తోంది..నేటి మన ధైర్య లక్ష్మి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతమంది వనితల విజయగాథలు, వివిధ రంగాల పురోగతిలోవెన్నెముఖగా నిలుస్తున్న మహిళల కు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.