ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మీరట్‌కు చెందిన బాధితురాలు.. బ్యాంక్‌లో పని చేస్తున్నానని చెప్పుకునే వ్యక్తితో ఇన్‌స్టాగ్రామ్‌లో స్నేహం చేసింది. ఆ వ్యక్తి తనకు బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని షామ్లీ జిల్లాలోని థానాభవన్‌కు రప్పించాడు. అక్కడ ఆమెకు మత్తుమందు ఇచ్చి, ఆ తర్వాత హోటల్‌కు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.