– చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
ఇదేనిజం, మందమర్రి : సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. మందమర్రి ఐఎన్టీయూసీ కార్యాలయంలో యూనియన్ నాయకులు వివేక్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 27వేల కోట్ల రూపాయల బాకీ చేసి నష్టాల్లోకి తీసుకెళ్లిందన్నారు. సింగరేణిలో లోకల్ కాంట్రాక్ట్ కార్మికులు, లోకల్ కాంట్రాక్టర్లు ఉండేలా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామన్నారు. సింగరేణి నిధులు సింగరేణి ప్రాంతంలో ఖర్చు చేసేలా చూస్తామన్నారు.ప్రజా సేవ చేసేందుకు బాధ్యతలు అప్పగించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు.