– బీసీ గురుకులం ప్రిన్సిపాల్ రజినీకాంత్
ఇదే నిజం, నాగార్జునసాగర్: తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం 2024-2025 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రజనీకాంత్ బుధవారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు డిసెంబర్ 18 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. దరఖాస్తులను ఆహ్వానించేందుకు 20 వరకు అవకాశం ఉందని అన్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. http://tgcet.cgg.gov.in ద్వారా ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తులను స్వీకరించాలని తెలిపారు.