Homeఅంతర్జాతీయంiphone 14: ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900

iphone 14: ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ.79,900

టెక్ దిగ్గజం యాపిల్ బుధవారం అత్యంత అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో కొత్త ఐఫోన్ 14 మోడళ్లను విడుదల చేసింది. దీంతో పాటు కొత్త వాచీ సిరీస్ 8, కొత్త తరం ఎయిర్పాడ్స్ ప్రో, వాచీ ఎస్ఈ 2లను కంపెనీ తీసుకొచ్చింది.

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్: ఐఫోన్ 14లో 6.1 అంగుళాల ఓఎల్ఈడీ తెర, 14 ప్లస్లో 6.7 అంగుళాల తెరను అమర్చారు. మిడ్నైట్, స్టార్ట్, బ్లూ, పర్పుల్, ప్రోడక్ట్ రెడ్ రంగుల్లో లభించనున్నాయి. ఇందులోని బ్యాటరీ ఐఫోన్ చరిత్రలోనే అత్యుత్తమమని కంపెనీ చెబుతోంది. ఏ15 బయోనిక్ చిప్, 12 మెగాపిక్సెల్ వెనుక, ముందు కెమేరాలు ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రారంభ ధర 799 డాలర్లు (భారత్ లో దీని ధర రూ. 79,900)గా, ఐఫోన్ 14 ప్లస్ ప్రారంభ ధర 899 డాలర్లు (భారత్ లో రూ. 89,900) గా నిర్ణయించారు. సెప్టెంబరు 16న ఐఫోన్ 14, 14 ప్లస్ అక్టోబరు 7న విపణిలోకి రానున్నాయి

Recent

- Advertisment -spot_img