Homeఫ్లాష్ ఫ్లాష్అంపైరింగ్ త‌ప్పిదం.. పంజాబ్‌కు గెలుపు దూరం

అంపైరింగ్ త‌ప్పిదం.. పంజాబ్‌కు గెలుపు దూరం

దుబాయ్‌: దిల్లీ క్యాపిటల్స్ తో పోరులో కింగ్స్‌ XI పంజాబ్ ఓట‌మికి అంపైర్ నితిన్ మేన‌న్ తీసుకున్న నిర్ణ‌యం కార‌ణ‌మ‌ని సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. 157 ర‌న్స్ ల‌క్ష్య‌సాధ‌న‌తో బ‌రిలోకి దిగిన పంజాబ్‌కు 18.3 ఓవ‌ర్‌లో బ్యాట్‌మెన్ అగ‌ర్వాల్ రెండు ర‌న్స్ తీశాడు. అయితే మ‌రో బ్యాట్‌మెన్ క్రిస్ జోర్డాన్ త‌న బ్యాటును క్రీజ్‌లో పెట్ట‌లేద‌ని లెగ్ అంపైర్ నితిన్ మేన‌న్ షార్ట్ ర‌న్ పేరుతో ఒక ర‌న్ కోత విధించాడు. అంపైర్‌ కోత విధించిన తర్వాత టీవీ రీప్లేల్లో క్రిస్‌ జోర్డాన్‌ బ్యాటును క్రీజులో ఉంచినట్టు స్పష్టంగా కనిపించింది. అంపైరింగ్‌ తప్పిదం మూలంగా ఒక జట్టు ఓటమి పాలవ్వడంతో అభిమానులు, మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, ఆకాశ్‌ చోప్రా అంపైర్‌ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మ్యాచ్‌లో అంపైర్ తీసుకున్న నిర్ణ‌యంపై పంజాబ్ ఐపీఎల్ పాల‌క మండ‌లికి ఫిర్యాదు చేయ‌నుంద‌ని స‌మాచారం.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img