Homeహైదరాబాద్latest NewsIPL 2024: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేసు.. 2 స్థానాల కోసం 7 జట్లు పోటీ!

IPL 2024: రసవత్తరంగా ప్లేఆఫ్స్ రేసు.. 2 స్థానాల కోసం 7 జట్లు పోటీ!

ఐపీఎల్ 2024 సీజన్ కీలక దశకు చేరుకుంది. ఇప్పటివరకు 54 గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇంకా లీగ్ దశలో 16 మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికీ ఏ జట్టు కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేయలేదు. అనూహ్యంగా కోలుకున్న ఆర్సీబీ కూడా పోటీలో నిలిచింది. అయితే ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ అందరికంటే ముందే ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ మిగిలిన 16 మ్యాచ్‌లు 9 జట్ల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ 4లో ఉన్నాయి.
ఈ నాలుగు జట్లలో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకున్నాయి. ఈ రెండు జట్లు మరో విజయం సాధిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ అర్హత సాధిస్తాయి. రాజస్థాన్ రాయల్స్.. ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒకటి గెలిచినా ఎలాంటి సమీకరణాలు లేకుండానే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. కేకేఆర్ మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా మరే జట్టుతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరనుంది. సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు ఐదో స్థానంలో ఉన్న లక్నో సూపర్‌జెయింట్‌లు మరో రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. లక్నో కి గెలుపుతో పాటు మెరుగైన రన్ రేట్ అవసరం. ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించాలి. అద్భుతం జరిగితే ఆర్‌సిబి, పంజాబ్ కింగ్స్‌లు ప్లేఆఫ్‌కు చేరే అవకాశం లేదు. టాప్-6లో ఉన్న జట్లు మిగిలిన మ్యాచ్‌ల్లో ఓడి వెనుకబడితేనే.. ఆర్‌సీబీ, పీబీకేఎస్ రేసులో నిలుస్తాయి. అయితే ఆ జట్లు టోర్నీలో మిగిలిన మూడు మ్యాచ్‌లకు మూడు గెలవాల్సి ఉంటుంది.

Recent

- Advertisment -spot_img