HomeతెలంగాణIPL-2024: సునీల్ నరైన్ ఖాతాలో అరుదైన రికార్డు..!

IPL-2024: సునీల్ నరైన్ ఖాతాలో అరుదైన రికార్డు..!

ఈడెన్ గార్డెన్స్ వేదికగా నిన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో IPL-2024లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా KKR నిలిచింది. ఈ మ్యాచ్ వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించారు. అయితే ఈ మ్యాచ్ లో నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్ ఒక్క వికెట్ తీశారు. ఇషాన్ కిషన్ వికెట్ తీసి ముంబై వికెట్ల పతనానికి నాంది పలికిన సునీల్ నరైన్ ఈ సీజన్‌లో తన ఖాతాలో 15వ వికెట్ వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ సీజన్‌లో 400+ పరుగులతో పాటు 15 వికెట్లు పడగొట్టిన మూడో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. నరైన్ కంటే ముందు ఈ ఘనతను షేన్ వాట్సన్, జాక్వెస్ కలిస్ అందుకున్నారు.

Recent

- Advertisment -spot_img